NLG: కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడ్డ ఘటన పెద్ద అడిశర్ల పల్లి మండలం దుగ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆకనబోయిన ఆంజనేయులు కుమారుడు గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైన చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.