KNR: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1996 ప్రకారం, గర్భస్థ శిశువు ఆడ లేదా మగ అని చెప్పడం నేరమని తెలిపారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.