NZB: ముందెన్నడూ లేని విధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ పేరుతో లేని భారాన్ని ప్రజలపై మోపింది నిజమా..? కాదా..? అని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. జీఎస్టీని తగ్గించామని చెబుతూ దేశవ్యాప్తంగా బీజేపీ డబ్బాలు కొట్టుకుంటోందని.. అసలు జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం ఎవరు వేయమన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.