SKLM: ఈనెల 26వ తేదీ వరకు హిరమండలం మండలంలోని రెండు చోట్ల ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో ఆర్ కాళీ ప్రసాద్ బుధవారం తెలిపారు. హిరమండలం మండలంలోని శుభలయ ఆర్ఆర్ కాలనీ అంగన్వాడీ కేంద్రం, పిండ్రువాడ గ్రామ సచివాలయం వద్ద 2 ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆధార్ సంబంధిత సేవలను ఈ 2 కేంద్రాల నుంచి ఈనెల 26 వరకు పొందవచ్చని ఎంపీడీవో సూచించారు.