TG: గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్-1 జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.