NLG: హాలియా మున్సిపాలిటీలోని వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఈ నెల ఆఖరు వరకు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రామ దుర్గారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఫీజు చెల్లించనట్లయితే అక్టోబర్ 1 నుంచి 50% పెనాల్టీ వేయాల్సి వస్తుందని తెలిపారు. వ్యాపారులు ఈ విషయాన్ని గుర్తించి ఈ నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని కోరారు.