KRNL: DSC కు ఎంపికైన అభ్యర్థులకు రేపు CM చంద్రబాబు చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO శామ్యూల్ పాల్ తెలిపారు. అమరావతిలో జరగనున్న డీఎస్సీ విజయోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 2,590 మంది అభ్యర్థులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి సుమారు 134 బస్సులు బయల్దేరుతాయని చెప్పారు.