ADB: రూరల్ మండలంలోని జందపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిని వెంటనే విధుల నుంచి తొలగించాలని హిందు సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం DPO రమేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా బతుకమ్మపై నుంచి కార్ తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. లేదంటే కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామని తెలిపారు.