E.G: రాజమండ్రి సెంట్రల్ జైలును బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం బుధవారం సాయంత్రం సందర్శించింది. ఈ బృందంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, తూ.గో.జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా న్యాయసేవాధికారి కార్యదర్శి ఎన్.లక్ష్మి, ఎస్పీ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు జైల్లో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను, వారు ఉండే బ్యారక్‌లను పరిశీలించారు.