పహల్గామ్ ఉగ్రదాడిలో తీవ్రవాదులకు సహకరించిన మహ్మద్ యూసఫ్ కటారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన ఉగ్రవాదులకు రవాణా సౌకర్యం కల్పించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇదివరకే మట్టుబెట్టిన విషయం తెలిసిందే.