NLR: సంగం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో బుధవారం శ్రీమహా లక్ష్మమ్మ ఆలయ జీర్ణోద్ధరణ పూజలు, విజయ గణపతి ఆలయ నిర్మాణానికి పూజలు నిర్వహించారు. వేద పండితుల నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటంరెడ్డి బాల కృష్ణారెడ్డి, పద్మజ దంపతులు, జడ్పీటీసీ రావుల లక్ష్మీ దంపతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.