MDK: భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు ఎప్పటికప్పుడు విచారణ చేసి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మనోహరాబాద్ తాహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. సాదా బైనామాలు, అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, నిషేధిత భూములు, భూభారతి సదస్సుల దరఖాస్తులపై GOPలకు అవగాహన కల్పించారు.