MBNR: యువత చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని జడ్చర్ల శాసన సభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బీఆర్ పీఎల్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండగ వేల స్నేహపూర్వక వాతావరణంలో యువత క్రీడా పోటీలలో పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.