JN: పిడుగుపాటుకు గేదే మృతి చెందిన ఘటన బచ్చన్నపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన రైతు చిట్టి రామచంద్రరెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉన్న పాడిగేదెపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కట్టేసి ఉన్న గేదె ప్రొద్దున చూసేసరికి మృతి చెందడంతో రైతు కన్నీటిపర్యం అయ్యాడు. గేదె విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని రైతు వాపోయాడు.