KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సాధారణ మహాసభ సమావేశం ఈరోజ ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో జరగనుంది. ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సంఘ సభ్యులు, రైతులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కార్యదర్శి చల్మెళ్ళ మల్లారెడ్డి కోరారు. ఈ సమావేశంలో సంఘం కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలు, కీలక అంశాలు చర్చించనున్నారు.