ప్రకాశం: పిల్లలకు మెరుగైన విద్యతోపాటు వారి ఆరోగ్యంపైనా సమాన దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాలల స్థితిగతులు, విద్యాసంబంధ విషయాలపై మంగళవారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఒంగోలు ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా ఆయన సమీక్షించారు. విద్య, వైద్యం, ప్రజలకు తాగునీరు తన ప్రాధాన్యత అంశాలని ఆయన తెలిపారు.