బంగారం ధరలు నాలుగైదు రోజులుగా వరుసగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.1,15,370కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 తగ్గి రూ.1,05,750 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర నిన్న 1,49,000 ఉండగా ఇవాళ రూ.1,000 పెరిగి రూ.1,50,000లకు చేరింది.