SKLM: పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి ఫ్రెడరిక్ తెలిపారు. బుధవారం ఉదయం జలుమూరు మండలం దొంపాకలో వ్యాధి నివారణ టీకాలు పశువులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.