KRNL: వాతావరణ శాఖ హెచ్చరికలతో రానున్న నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టరు డాక్టర్ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.