SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో ప్రభుత్వ నిర్మించిన పల్లె దావాఖానా నిరుపయోగంగా మారింది. ఆయుష్మాన్ భారత్ కింద మరిగడ్డ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి బ్రిడ్జి సమీపంలో పల్లెదావాఖన నిర్మించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఊరికి దూరంగా నిర్మించడంతో ఉపయోగం లేకుండా పోయింది. కనీసం అధికారులు సైతం పట్టించుకోవడం లేదు.