SRPT: మానవ నిర్లక్ష్యానికి మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటీవల కోదాడలో 5 నెలల సూడి పశువు కడుపులో 90 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు బయటపడడం హృదయాలను కదిలిస్తోంది. పశువులు మేతగా భావించి తింటున్న ప్లాస్టిక్ జీర్ణం కాక, జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి పశువుల ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో నిషేధ చట్టాల అమలు లేకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది.