ELR: జిల్లాలో జాతీయ రహదారులకు సంబందించిన భూసేకరణ వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఇవాళ సమీక్షించారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కోర్టులో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.