SRD: కంగ్టి మండలం దేగులవాడి, ఎన్కేమూరి గ్రామాల్లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శ్రీ దుర్గాభవాని మాత అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈయన వెంట మాజీ సర్పంచ్లు కృష్ణ ముదిరాజ్, బాలాజీ పటేల్, మాజీ ఎంపీటీసీ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.