NGKL: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఉర్కొండ మండలం గుండ్ల గుంటపల్లిలో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తులు వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన జంగయ్య(47) కల్వకుర్తి హరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.