GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కలరా కేసులు నమోదవుతున్నాయి. వాంతులు, నీళ్ల విరోచనాలతో బాధపడుతూ, ముగ్గురు బాధితులు ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, కలరా వ్యాధిగా మెడికల్ రిపోర్టులో తేలినట్లు మంగళవారం తెలిసింది. విజయవాడ, గుంటూరు నుంచి ఏడుగురు కలరా వ్యాధితో బాధపడుతూ, ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరినట్లు చెబుతున్నారు.