KRNL: అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదోని టౌన్ ప్లానింగ్ అధికారి బాల మద్దయ్య తెలిపారు. రామజల వంక, ఆవుదూడ వంకల వద్ద అనేక ఆక్రమణలు గుర్తించామని, 12 అడుగుల వెడల్పు ఉండాల్సిన వంక మూడు అడుగులకే పరిమితమైందన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వస్తోందని తెలిపారు. అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించకపోతే అధికారుల సూచన మేరక కూల్చివేస్తామన్నారు.