E.G: పెరవలిలో ఆర్టీసీ బస్సు ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ బుధవారం స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందడంపై మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.