WGL: నల్లబెల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే దసరా పండుగ ఏర్పాట్లను స్థానిక ఎస్సై గోవర్ధన్ పరిశీలించారు. పండుగ సందర్భంగా గ్రామంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత కమిటీ సభ్యులకు ఆదేశించారు. కమిటీ సభ్యులతో కలిసి వేదికలు, లైటింగ్, రవాణా మార్గాలు తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.