RR: సినీ నటుడు సుమన్ షాద్ నగర్‌కు చెందిన కుంగ్ ఫూ, కరాటే మాస్టర్లు కలిశారు. ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్, జపాన్ కరాటే మాస్టర్ శివకృష్ణ గౌడ్ ఆయనను సత్కరించారు. అనంతరం సుమన్ చేతుల మీదుగా విద్యార్థులు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలబాలికలకు ఆత్మ రక్షణ కోసం కుంగ్ ఫూ, కరాటే ఉపయోగపడతాయన్నారు.