BHPL: జిల్లాలో 94,360 ఎకరాల్లో సాగవుతున్న పత్తి పంటపై రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. అధిక వర్షాలతో తేమ వల్ల తెగుళ్లు, తెల్ల, పచ్చ దోమ, చీడ పీడలు పత్తి మొక్కలను వెంటాడుతున్నాయి. ఆకులు, పూత ఎర్రబడి రాలిపోతుండటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మద్దతు ధరపైనే రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.