ELR: ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలోని గొల్ల చెరువులోకి దిగిన బాలుడు ముద్దే రాజు (14) నీట మునిగి, మృతి చెందాడు. రాజు దసరా సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు తన 4 గురు స్నేహితులతో కలిసి మంగళవారం చెరువులో దిగాడు. అతడు నీటిలో మునిగిపోవడంతో ఆ విషయాన్ని స్నేహితులు అటుగా వచ్చిన ఓ యువకుడికి చెప్పారు. అతడు బయటకు తీసేసరికే రాజు మృతి చెందాడు.