VSP: శరన్నవరాత్రులను పురస్కరించుకొని చోడవరం పాత బస్టాండ్ దగ్గర కొలువై వున్న దుర్గమ్మ బుధవారం అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. వేకువ జామునే పూజారులు శివకుమార్ శర్మ,రమేష్ అమ్మవారిని చూడ ముచ్చటగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్ధం సిద్ధం చేశారు. ముఖ్యంగా భవానీ భక్తులు తల్లి దర్శనం కోసం పరిసర గ్రామాలు నుంచి వస్తున్నారని అర్చకులు తెలిపారు.