MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శ్రీ సాయి ఏజెన్సీస్ వారి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ సూపర్వైజర్లు పారిశుద్ధ్య కార్మికులు ఏజెన్సీ కింద 204 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 160 మందితో సరి పెట్టేస్తున్నారు. ఈ తతంగమంతా కూడా అధికారుల కనుసన్నలోనే జరుగుతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.