యంగ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా అద్భుతంగా నటించారు. అయితే ఈ పాత్రకు మొదటి ఛాయిస్ మనోజ్ కాదట. తొలుత టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించగా.. ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ఆఫర్ వదులుకున్నట్లు తెలుస్తోంది.