టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు మారి కాంబోలో ‘అనగనగా ఒకరాజు’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా రేపు విడుదల కానుండగా.. ఆయా థియేటర్లలో ఈ మూవీకి సంబంధించి సంక్రాంతి ప్రోమో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.