KNR: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద ఈ నెల 4న పట్టుకున్న రెండు లారీల ఇసుకకు 26న రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు ముందుగా రూ. 5వేలు డిపాజిట్ చేయాలని కోరారు.