SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామం మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా తవ్విన కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ భూముల్లో సర్వే నిర్వహించి ఎలాంటి నష్టపరిహారం చేయకుండానే వదిలి వేశారన్నారు. మళ్లీ ఇటీవల అధికారులు ఈ కాలువ తవ్వకం పనులు పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.