PLD: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గాదేవి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాచవరంలోని వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారు సంతాన లక్ష్మిగా, శివాలయంలోని భ్రమరాంబ అమ్మవారు గాయత్రీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.