KRNL: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ కర్నూలు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.