VSP: విశాఖలోని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) నిర్మించిన ఈసీబీసీ భవనాన్ని ‘ఎనర్జీ ట్రాన్సిషన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్’గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రం సస్టెయినబుల్ ఎనర్జీపై పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించనుంది.