హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్జన్ ప్రాజెక్టుల విభాగం ఇంజినీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రూ.3 వేల కోట్ల పనులు ఇప్పటికీ మొదలుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. పనిచేయకపోతే వెళ్లిపోవాలని, లేకపోతే మాతృ సంస్థకు తిరిగి పంపించేస్తానని హెచ్చరించారు.