SRFD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కేతకి అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక ఆలయ పూజారులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అదేవిధంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి కూడా ప్రత్యేక అభిషేక ప్రజలు నిర్వహించారు. అనంతరం మహా మంగళ హారతి సమర్పించారు నైవేద్యం సమర్పించారు. భక్తులు దర్శించుకుంటున్నారు.