దసరా పండుగ సందర్భంగా పేద మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కొత్తగా 25 లక్షల ఉచిత LPG గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 10.58 కోట్లకు చేరింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్కో కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం కేంద్రం సుమారు రూ.2,050 ఖర్చు చేస్తుందని తెలిపారు.