AP: జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఎందుకు భయమని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే చేయండని.. ప్రజలకు తప్ప జగన్ ఎవరికీ లొంగరని తేల్చి చెప్పారు.