హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశించారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలని పోలీస్ విభాగానికి సూచించారు. అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో వీటిని వాడాలని చెప్పారు. డ్రోన్ ద్వారానే వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.