యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గోదారి గట్టుపైన’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న సాయంత్రం 5:07 గంటలకు థియేటర్స్‌లో ‘ఓజీ’కి అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.