GNTR: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి తెనాలి పట్టణంలోని పలు ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, చిన్నారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళీమాత ఆలయం వద్ద జరిగిన ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ పాల్గొన్నారు.