ATP: గుత్తి మండలం కరిడికొండ, బేతాపల్లి గ్రామ సచివాలయాల్లో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ సోమవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 23, 24 తేదీల్లో కరిడికొండ, 25, 26 తేదీల్లో బేతపల్లి సచివాలయాలలో ఆధార్ క్యాంపులు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.