VZM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే తల్లి విజయనగరం పైడితల్లి సిరిమాను చెట్టు గంట్యాడ మండలం, కొండతామరాపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. పూజారికి కలలో అమ్మవారు సాక్షాత్కరించినందున బుధవారం ఉదయం 9.15 గంటలకు సిరిమాను వృక్షా నికి బొట్టు పెట్టేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.