KMM: జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్, దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.